Homeహైదరాబాద్latest Newsనందిగం సురేష్ ఆరోగ్యం బాగుంది అని వైద్యులు రిపోర్ట్.. మళ్లీ జైలుకు తరలింపు

నందిగం సురేష్ ఆరోగ్యం బాగుంది అని వైద్యులు రిపోర్ట్.. మళ్లీ జైలుకు తరలింపు

గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. భుజం, ఛాతిలో నొప్పిగా ఉందని జైలు అధికారులకు చెప్పడంతో చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌లో వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం సురేష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు అతడిని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తరలించారు.మరోవైపు నందిగాం సురేష్ రాక సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు.

Recent

- Advertisment -spot_img