ఇదే నిజం, గూడూరు: జులై 4న ఖమ్మంలో జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలను, భూస్వాములను గడగడలాడించి ప్రజల కోసం ప్రతిఘటన పోరాటంలో అసువులు బాసిన, తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం రోజున గూడూరు మండల లోని బొద్దుగొండ గ్రామంలో, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి సదస్సు వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం. గజ్జి లింగన్న అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా నాయకులు మాట్లాడారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేడు దేశంలో పెట్రేగిపోతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా, హిందూ మతోన్మాదానికి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో దొడ్డి కొమరయ్య కొమరం భీమ్, బీర్సముండా లాంటి త్యాగాలను నెమరు వేసుకుంటూ.. నేటి నాయకత్వం ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దణసరి రమేష్, ఎస్.కె. రియాజ్, ఫరీద్, గుగులోతు శంకర్, ఈసం లక్ష్మయ్య, తొలేం రామారావు, నగరబోయిన వీరస్వామి, కత్తుల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.