Homeహైదరాబాద్latest Newsహైడ్రాకు దమ్ముందా? ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా నిర్మించిన ఆ విద్యాసంస్థలను కూల్చివేస్తారా..?

హైడ్రాకు దమ్ముందా? ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా నిర్మించిన ఆ విద్యాసంస్థలను కూల్చివేస్తారా..?

హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారిస్తున్న విషయం మనకు తెలిసిందే. గత శనివారం తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ ను కూల్చివేసిన విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు అంతకుమించిన ఆక్రమణ మీద చర్చ మొదలైంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సాగించిన దురాగతానికి హైడ్రా చరమగీతం పాడుతుందా? లేదా? అని ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. హైదరాబాద్ లోని పాతబస్తీ, బండ్లగూడ మండల పరిధిలోని సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యా సంస్థలు నిర్మించారు. చెరువును సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు నిర్మించారు. ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసిన హైడ్రా ఇప్పుడు ఫాతిమా కళాశాల దగ్గరకు ఎందుకు వెళ్లడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా కట్టుకున్న ఆ కాలేజీల ను కూల్చే ధైర్యం హైడ్రా బుల్డోజర్లకు లేదా? అంటూ నిలదీస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఏమాత్రం నిబద్ధత ఉన్నా వెంటనే ఈ అక్రమ నిర్మాణాలను కుప్పకూల్చాలని. చెరువును ఒవైసీ బ్రదర్స్ చెర నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img