Homeహైదరాబాద్latest Newsబండి సంజయ్ కు బుర్ర ఉందా? ఆయన్ను మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి.. బీఆర్ఎస్ నేత...

బండి సంజయ్ కు బుర్ర ఉందా? ఆయన్ను మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి.. బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

  • కేటీఆర్‌ను జైళ్లో వేయాలని రేవంత్‌ రెడ్డికి బండి చెప్పడం ఏంటి?
  • బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ బాబు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బండి సంజయ్ కి బుర్ర ఉందా? అంటూ కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌ పేర్కొన్నారు. బండి సంజ‌య్ అవ‌గాహ‌న లోపంతో మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో రావుల శ్రీధ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ను జైళ్లో వేయాలని సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజ‌య్ చెప్పడం ఏంట‌ని శ్రీధ‌ర్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారు అని నిలదీశారు. గ‌తంలో ఎంపీ హోదాలో మసీదులు తవ్వాలే, శవాలు తవ్వాలే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పోనీలే అని అనుకున్నాం, కానీ ప్ర‌స్తుతం కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా కొద్దిగా బుద్దిజ్ఞానం తెచ్చుకుని మాట్లాడుతారు అనుకుంటే, కేటీఆర్‌ను జైళ్లో వేస్తామని మాట్లాడం ఏంట‌ని, ఎర్రగడ్డ మెంటల్‌ హాస్పిటల్‌లో బండి సంజ‌య్‌ను చేర్పించాల్సిన అవసరం ఉంద‌న్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి పని చేస్తున్నాయని రావుల శ్రీధ‌ర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పదేళ్లు రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ ఎంతో అభివృద్ధి చేశార‌ని.. ఆ అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? అని బండి సంజ‌య్‌కు శ్రీధ‌ర్ రెడ్డి స‌వాల్ విసిరారు. ఏదో నరేంద్రమోదీ, జైశ్రీరామ్‌ నినాదం వల్ల సంజ‌య్‌కు పదవి వచ్చిందని, ఈ పదవితో కేటీఆర్‌ను విమర్శిస్తే మాత్రం సహించేది లేదు అని శ్రీధ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Recent

- Advertisment -spot_img