ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది డైటింగ్ చేస్తుంటే..ఇంకొంతమంది వ్యాయామం లేదా వాకింగ్ చేస్తుంటారు. ఇంకొందరు రెండూ చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఫిట్ అండ్ హెల్తీగానే కాకుండా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. రోజూ మార్నింగ్ వాకింగ్ తరువాత పుష్కలంగా నీళ్లు తాగాలి. దీనివల్ల డీ హైడ్రేషన్ సమస్య తలెత్తదు. మార్నింగ్ వాకింగ్ అనంతరం శరీరంలో పెరిగే అలసట నుంచి ఉపశమనం పొంది ఎనర్జీ పొందేందుకు నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ కలుపుకుంటే ఇంకా మంచిది. అదే విధంగా మార్నింగ్ వాకింగ్ తరువాత చేయాల్సిన మరో ముఖ్యమైన పని స్ట్రెచింగ్. దీనివల్ల చాలా సమస్యల్నించి రిలీఫ్ లభిస్తుంది. మార్నింగ్ వాకింగ్ చేసినప్పుడు సహజంగానే కండరాల నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాళ్లు, చేతులు స్ట్రెచింగ్ చేయడం వల్ల నొప్పి ఉండదు. మీ బాడీ కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది. రోజూ మార్నింగ్ వాకింగ్ తరువాత సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. దీనివల్ల శరీరానికి ఎనర్జీ లభించడమే కాకుండా కావల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు చాలా పెద్దమొత్తంలో ఉంటాయి. మార్నింగ్ వాకింగ్ తరువాత శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ప్రయత్నించాలి. అందుకే వాకింగ్ అయిన వెంటనే స్నానం చేసి ఫ్యాన్ గాలిలో లేదా ఏసీలో రిలాక్స్ అవాలి. దీనివల్ల గుండె ప్రశాంతంగా కొట్టుకుంటుంది. శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. మార్నింగ్ వాకింగ్ అనంతరం బాడీలో ఎనర్జీ కోసం ఎలక్ట్రోలైట్స్ వాటర్‌తో పాటు ప్రోటీన్ షేక్ తాగడం మంచిది. ఇది తాగడం వల్ల బాడీ డీ హైడ్రేషన్ అవకుండా ఉండటమే కాక శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అదే సమయంలో శరీరానికి కావల్సిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.