దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 1,502 పాయింట్లు నష్టపోయి 79,479 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 466 పాయింట్లు కోల్పోయి 24,251 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.78 వద్ద ప్రారంభమైంది.