దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద.. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఐటీసీ, మారుతీ, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో.. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటన్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.