మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 గంటలకు సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 22,668 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.49 వద్ద ప్రారంభమైంది. అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, టాటా స్టీల్, M&M, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, NTPC, టాటా మోటార్స్, JSW స్టీల్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.