Homeఅంతర్జాతీయం'నోబెల్ బహుమతి'‌కి ట్రంప్ నామినేట్

‘నోబెల్ బహుమతి’‌కి ట్రంప్ నామినేట్

వాషింగ్టన్ డీసీ: 2021 నోబెల్ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారు. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య ‘చారిత్రక శాంతి ఒప్పందం’ జ‌రిగేలా కృషి చేసినందుకు ఆయనను నార్వే ఎంపీ క్రిస్టియన్ టైబ్రింగ్-గ్జెడ్డే(57 ) ట్రంప్‌ను నామినేట్ చేశారు. శాంతి బహుమతి అందుకునేందుకు ట్రంప్‌కే ఎక్కువ యోగ్యత ఉందని, ఆయా దేశాల మధ్య శాంతిని నెలకొల్పే విషయంలో ఇతర నామినీల కంటే ట్రంప్ ఎంతో కృషి చేస్తున్నారని గ్జెడ్డే తన నామినేషన్ లేఖలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య శాంతి కోసం తాను చేసిన కృషికి నోబెల్ బహుమతి వస్తుందని ఆశిస్తున్నట్టు గతేడాది ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. బరాక్ ఒబామాకి గతంలో నోబెల్ బహుమతి ఇవ్వడాన్ని కూడా ఆయన అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img