పార్టీ ఫిరాయింపులపై ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరూ తొందరపడొద్దు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారటాన్ని పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ఇలాంటి పరిణామాలు వైఎస్ హాయంలోనే జరిగాయి. అయినా మనం భయపడలేదు. భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయి. రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు.