Homeహైదరాబాద్latest Newsభయపడి పారిపోకు.. రాహుల్ గాంధీపై ప్రధాని వ్యంగ్యస్త్రాలు

భయపడి పారిపోకు.. రాహుల్ గాంధీపై ప్రధాని వ్యంగ్యస్త్రాలు

ఇదే నిజం, నేషనల్: వయనాడ్​లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్​బరేలీకి పారిపోయారని ప్రధాని మోడీ విమర్శించారు. రాయ్‌ బరేలీలో రాహుల్‌ గాంధీ పోటీ నిర్ణయంపై మోడీ సెటైర్లు వేశారు. శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని బార్దామన్, క్రిష్ణానగర్​, అమోద్​పూర్​లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఆయనకు ఒక్కటే చెప్పదల్చుకున్నా.డర్​ మత్.. భాగ్ మత్ (భయం వద్దు.. పారిపోవద్దు)’ అంటూ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ‘వాళ్ల అగ్రనేత పోటీకి భయపడతాడని నేను ముందే చెప్పా. ఆయన మాత్రమే కాదు.. సోనియా గాంధీకి కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు. అందుకే ఆమె రాజ్యసభ వంకతో రాజస్థాన్‌ పారిపోయారు. ఇంతలా భయపడే వీళ్లు దేశమంతా తిరుగుతూ ప్రజల్ని భయపడొద్దని చెబుతున్నారు. వయనాడ్​లో ఆయన ఓడిపోతారని నేను చెప్పా. ఆయన తన ఓటమిని ముందుగానే గుర్తించారు. అందుకే ఇప్పుడు మరో చోట పోటీ చేస్తున్నారు. నేను చెబుతున్నా.. భయపడకు, పారిపోకు’ అంటూ ప్రధాని మోడీ అన్నారు. రాయ్​బరేలీలో ఓటింగ్ ముగిసిన త‌ర్వాత రాహుల్ తన మూడో స్థానం గురించి ప్రయత్నాలు మొదలుపెడతారని మోడీ కౌంటర్ ఇచ్చారు.

స్కామ్​ల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానిది ఓ రికార్డ్
పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ ప్రభుత్వం స్కామ్‌ల్లో రికార్డు సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఈ ప్రభుత్వంలో వివిధ రంగాల్లో స్కామ్‌లు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంజి స్కామ్, బొగ్గు అక్రమ రవాణా స్కామ్, రేషన్ పంపిణీ స్కామ్, ఉద్యోగ నియామకాల స్కామ్‌లు ఈ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, చివరకు రక్షణ రంగంలో సైతం స్కామ్ జరిగిందని గుర్తు చేశారు. నాటి యూపీఏ ప్రభుత్వ బాటలోనే మమతా బెనర్జీ సర్కారు పయనిస్తోందని ఆరోపించారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల నివాసాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయిల నగదు పట్టుబడిన విషయాన్ని ఈ సందర్బంగా మోడీ గుర్తు చేశారు. అయితే ఈ స్కామ్‌లపై విచారణ జరపాలని కోల్‌కతా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం.. కేంద్రం దర్యాప్తు సంస్థ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇండియా కుటమిలోని పార్టీల్లోని నేతలకు దూర దృష్టి లేదని విమర్శించారు. మూడు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు కొత్త విద్య విధానాన్నే ప్రవేశ పెట్టలేదని చెప్పారు. కానీ తమ 10 ఏళ్ల పాలనలో దేశంలో అధునిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

దోచుకొనేందుకు కాంగ్రెస్, జేఎంఎం కుట్ర
దేశాన్ని దోచుకొనేందుకు కాంగ్రెస్​ పార్టీ కుట్ర చేస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. అవినీతి, కుంభ‌కోణాల్లో పట్టుబడిన కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనం ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో పట్టుబడ్డ కాంగ్రెస్ నేతుల ఇప్పుడు మరోసారి దేశాన్ని దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. శుక్ర‌వారం జార్ఖండ్‌లోని సింగ్భుమ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు కాంగ్రెస్‌, జేఎంఎం నేత‌ల‌కు ప‌ట్ట‌వ‌ని అన్నారు. వారు ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని ఎందుకు త‌హ‌తహ‌లాడుతున్నార‌ని మీరు అనుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు..మీ మేలు కోసం ప‌నిచేసేందుకని మీరు అనుకుంటే పొర‌పాట‌ని అన్నారు. దేశాన్ని య‌దేచ్ఛ‌గా దోచుకునేందుకే వారు ఢిల్లీలో కొలువుతీరాల‌ని కోరుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. 2014కు ముందు వారు దేశానికి చేసిందేమీ లేద‌ని, దేశాన్ని దోచుకున్నార‌ని మండిప‌డ్డారు.

Recent

- Advertisment -spot_img