Homeహైదరాబాద్latest Newsఆ సినిమాతో పోల్చకండి … 'పుష్ప 2' మూవీపై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్..!

ఆ సినిమాతో పోల్చకండి … ‘పుష్ప 2’ మూవీపై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పుష్ప 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవడంతో మరిన్ని స్క్రీన్లు అవసరమయ్యాయి. ఇందుకోసం హాలీవుడ్ సినిమా ‘ఇంటర్‌స్టెల్లార్’ రీ-రిలీజ్ కోసం ఇచ్చిన చాలా ఐమాక్స్ థియేటర్లను కూడా ‘పుష్ప 2’ సినిమాకి కేటాయించరు. దీంతో ‘పుష్ప 2’ సినిమా కంటే ‘ఇంటర్‌స్టెల్లార్’ సినిమానే బెటర్ అని కొందరు ‘పుష్ప 2’ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనిపై జాన్వీ కపూర్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ‘పుష్ప 2’ కూడా సినిమానే.. ఇతర సినిమాలతో పోల్చి మన తెలుగు సినిమాను, మన దేశాన్ని ఎందుకు అవమానిస్తున్నారు? హాలీవుడ్ సినిమాల కోసం మన సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతుంటే.. మన భారతీయ సినిమాలను హాలీవుడ్ వారు పొగుడుతున్నారు అని తెలిపింది. కానీ ఇప్పటికీ మన సినిమాలను తక్కువ చేసి మనల్ని మనం అవమానించుకుంటున్నాం.. చాలా బాధగా ఉంది’ అంటూ జాన్వీ కపూర్ వారిపై మండిపడింది.

Recent

- Advertisment -spot_img