Homeహైదరాబాద్latest Newsఅటువంటి వెధవ పనులు చేయం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అటువంటి వెధవ పనులు చేయం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని.. అటువంటి వెధవ పనులు చేయబోదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌ చాట్‌లో ఆయన మాట్లాడారు. ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చానన్నారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ట్యాపింగ్‌పై ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కరెంటు కోతలు లేవని.. కొన్ని అంతరాయాలతో అక్కడక్కడ సమస్యలు వస్తున్నాయన్నారు.

అత్యంత పారదర్శకంగా పాలన
తెలంగాణలో అత్యంత పారదర్శకంగా తన పాలన సాగుతోందని.. ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం ఇవ్వడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలంగాణలో ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో అనేక విమర్శలు, అధికారుల బదిలీలు జరిగాయని.. కానీ, తెలంగాణలో అలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిందని వెల్లడించారు.

రాచరికానికి తెలంగాణ వ్యతిరేకం
రాచరికానికి తెలంగాణ వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌ చాట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని చెప్పారు. వాటిని ప్రతిబింబిస్తూనే చిహ్నాం, గేయం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకి అప్పగించామని పేర్కొన్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డపై జ్యుడీషియల్ కమిటీ నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img