Homeహైదరాబాద్latest Newsవినాయక చవితి రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. ఎందుకంటే..?

వినాయక చవితి రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. ఎందుకంటే..?

సెప్టెంబర్ 7, శనివారం వినాయక చవితి పండుగ. ఈ రోజు ఇళ్లల్లో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తాం. అయితే మనం ఇంట్లో పూజ చేసే విగ్రహం ఈ విధంగా ఉండాలి. ఆ రోజున కొన్ని పనులు చేయొద్దని పండితులు చెబుతున్నారు.

  1. తులసి దళాలు: బొజ్జ గణపయ్య పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. తులసిని వినాయకుడు శపించాడని పురణాలు చెబుతున్నాయి.
  2. చంద్రుడు: శివుడి శిగలో ఉండే చంద్రుడు ఒకసారి వినాయకుడి గజరరూపాన్ని వెక్కిరించాడని.. ఆ రోజున చంద్రుడిని చూస్తే కష్టాలు పడతారని నమ్మకం.
  3. వెండి పాత్రలు: గణేశుడి పూజలో వెండి పాత్రలు, తెల్లటి వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు.
  4. విరిగిన బియ్యం: వినాయకుని పూజలో విరిగిన బియ్యాన్ని సమర్పించకూడదు.
  5. మొగలి పువ్వులు: శివుడు మొగలి పువ్వుని శపింస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వినాయకుని పూజలో వీటిని ఉపయోగించరాదు.
  6. ఎండిన పువ్వులు: వినాయకుని పూజలో పొరపాటున కూడా ఎండిన లేదా వాడిన పువ్వులను సమర్పించవద్దు.

Recent

- Advertisment -spot_img