Homeజిల్లా వార్తలుచిన్న చిన్న కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగొద్దు: ఎస్పీ సింధు శర్మ

చిన్న చిన్న కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగొద్దు: ఎస్పీ సింధు శర్మ

ఇదే నిజం, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా చిన్న, చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని ఎస్పీ సింధు శర్మ సూచించారు. రాజీ కుదుర్చుకోవడమే రాజమార్గమని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 28 జాతీయ మెగా లోక్అదాలత్ ఉన్నందున రాజీపడ దగిన కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా, ఆస్తి విభజన, కుటుంబపరమైన, వైవాహిక జీవితానికి సంబంధించిన, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెకౌబౌన్స్, రోడ్డు ప్రమాదం, డ్రంకన్ డ్రైవ్, పెట్టి కేసులనుపరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. న్యాయస్థానాలు ఇచ్చిన అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

spot_img

Recent

- Advertisment -spot_img