Homeహైదరాబాద్latest News'హిందువుల మనోభావాలు దెబ్బతీయద్దు'

‘హిందువుల మనోభావాలు దెబ్బతీయద్దు’

ఇదేనిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురిలో కస్తూరి రాజన్న ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ సమావేశం జరిగింది. రాజకీయ లబ్ధి కోసం దేవుళ్ల పేరు వాడుకుంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ విశ్వహిందూపరిషత్ సభ్యులు తప్పుబట్టారు. ఇటీవల తుక్కుగూడలో ‘ అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు నిజమైనవి కాదని, స్థానికంగా రేషన్ బియ్యంతో తయారుచేసినవన్న” సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యను తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో ‘ జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా’ అంటూ కేసీఆర్, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ దేవుళ్లను, దేవతలను అవమానపరిచేవిధంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అల్లం దుర్గాప్రసాద్,నలమాసు వైకుంఠం,రవికుమార్, శ్రీనివాస్, సురేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img