Homeహైదరాబాద్latest Newsరైలు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎందుకు రద్దు అవుతుందో తెలియదు.. ఎంఎంటీఎస్‌పై ఎందుకు ఈ నిర్లక్ష్యం...

రైలు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎందుకు రద్దు అవుతుందో తెలియదు.. ఎంఎంటీఎస్‌పై ఎందుకు ఈ నిర్లక్ష్యం .. !

ఎంఎంటీఎస్ రైళ్ల రద్దును నిరసిస్తూ వివిధ కాలనీల ప్యాసింజర్ సంఘాలు, సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రైలు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఎందుకు రద్దు అవుతుందో తెలియదు. ‘నగరానికి లైఫ్‌లైన్‌ అయిన ఎంఎంటీఎస్‌పై నిర్లక్ష్యం ఎందుకు’ అని రైల్వే ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణకు సంబంధించి రెండు రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల ఉన్నతాధికారులు ప్రయాణికుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లు రాకపోకలు సాగించడంపై వివిధ సంఘాల ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img