బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వమని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ‘జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు. ఆ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం. మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.