తెలంగాణ ప్రభుత్వం సరికొత్త బీమా పథకం తెచ్చింది. ఇది మహిళా స్వశక్తి సంఘాల్లో సభ్యులైన మహిళలకు వర్తిస్తుంది. ఈ పథకం పొందాలంటే.. సభ్యురాలి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉండాలి. దీని ద్వారా సభ్యురాలు సాధారణంగా మరణిస్తే, ఆమె కుటుంబానికి ప్రభుత్వం రూ.2 లక్షలు బీమా పరిహారం ఇస్తుంది. ఒకవేళ సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే, ఆమె కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు బీమా పరిహారం ఇస్తుంది.