Homeహైదరాబాద్latest Newsడ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు: నార్కోటిక్స్ సీఐ కృష్ణమూర్తి

డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు: నార్కోటిక్స్ సీఐ కృష్ణమూర్తి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమానికి నార్కోటిక్స్ సీఐ కృష్ణమూర్తి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాటి బారిన పడకుండా తమ తల్లిదండ్రులు కలలు కన్న ఆశయాలను నెరవేర్చి, ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కళాశాలల్లో, పాఠశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం, దుష్పరినామాలపై అవగాహన కల్పించుటలో భాగంగా ముస్తాబాద్ లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరు అరికట్టేందుకు కృషి చేసినప్పుడే వాటిని నిర్మూలించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు అందజేసి మార్కద్రవ్యాలను నిర్మూలిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గణేష్, పాఠశాల ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img