రెండు ఆస్కార్ అవార్డులు సాధించి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ఏఆర్ రెహమాన్ ఇప్పటికీ సంగీత ప్రపంచానికి సంగీత రారాజుగా పేరుగాంచారు. భారతదేశంలోని కోట్లాది మంది అభిమానులకు ఆయన స్ఫూర్తి. ఈ నేపథ్యంలో ఏఆర్ రఖుమాన్ విడాకుల వార్త ఆయన అభిమానులను షాక్ కు గురి చేసింది. ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించిన మరుసటి రోజే, అతని సంగీత బృందానికి చెందిన మోహిని డే తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను స్పందించింది. రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని, రెహమాన్ గురించి చెడుగా ప్రచారం చేయవద్దు విజ్ఞప్తి చేసారు. నేను అతనిని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి ఇదే నిదర్శనం. అతను కూడా నన్ను ప్రేమించాడు. దయచేసి ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయవద్దు అని సైరా భాను తెలిపారు. గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని, అందుకే రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు సైరా భాను వాయిస్ క్లిప్ విడుదల చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెహమాన్ భార్య ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది.