ఇదే నిజం జనవరి 7 బెల్లంపల్లి : నూతన భూగర్భ గనులను ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పలి. ఎస్ జి కే ఎస్ కార్యాలయ ఆవరణలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం తేదీ 12-01-2025, ఆదివారం, ఉదయం, 11-00, గంటలకు, ఎస్ – సి కమ్యూనిటీ హాల్ కాంటా చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా లో ఓపెన్ కాష్ట్ లకు వ్యతిరేకంగా జరుగు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని తెలిపిన. జేఏసీ నాయకులు ఓపెన్ కాస్ట్ ల వలన ఉపాధి అవకాశాలు రాకపోగా కన్నతల్లి లాంటి ఉన్న ఊరును, కొద్దో గొప్ప ఉపాధినిచ్చే ప్రాంతాన్ని బొందలగడ్డలుగా మార్చే ఓపెన్ కాస్ట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని బెల్లంపల్లి ప్రజలకు, ఈ ప్రాంత వర్తక, వాణిజ్య, చిరుద్యోగులకు, రైతు సోదరులకు, అసంఘటిత కార్మిక వర్గానికి, విద్యార్థి లోకానికి,నిరుద్యోగులకు, తమ ఊర్లను వల్ల కార్డు చేస్తున్న ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను ప్రతిఘటించడానికి బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించుటకై తేదీ 12-01-2025, ఆదివారం, ఉదయం 10-00,, గంటలకు ఎస్సీ కమ్యూనిటీ హాల్, బెల్లంపల్లి కాంటా చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా లో జరుగు రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరై తమ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు ,అందించి ఈ ఓపెన్ కాస్ట్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో టి మని రామ్ సింగ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి. చాంద్ పాషా రాష్ట్ర అధ్యక్షులు ఐఎఫ్టియు అంబాల మహేందర్, సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ జి కే ఎస్ తదితరులు పాల్గొన్నారు.