ఇదే నిజం, నర్సంపేట : అసెంబ్లీలో నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మాధవరెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండవసారి. 1999 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2014లో గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. అయినా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాక్షేత్రంలో నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డిపై 18,180 మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల స్కీమ్‌తో పాటు డివిజన్‌లో సాగునీటితో ఆయకట్టు స్థిరీకరణ, రంగయ్య, పాకాల, మాదన్నపేట చెరువులకు పంట కాలువకు సిమెంట్ లైనింగ్ పనులు, పట్టణ సుందరీకరణతో పాటు అంతర్గత రహదారులు, మరో కాలువ మరమ్మత్తులకు నిధులు, పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతారని ప్రజల హామీ ఇచ్చారు.