న్యూఢిల్లీః సెప్టెంబర్ 19 నుంచి 10 వరకు దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో నిర్వహించనున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్)-2020లో పాల్గొనే క్రికేటర్లకు డోపింగ్ టెస్టులను నిర్వహించేందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంఘం(నాడా) సిద్ధమైంది. విరాట్‌కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనిలతోపాటు స్టార్ క్రికేటర్లందరి నుంచి సాంపిల్స్ సేకరించనున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే వేదికలతోపాటు ప్రాక్టిస్ సెంటర్లలో ఆటగాళ్ల నుంచి సాంపిల్స్ సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 5గురు సభ్యులతో కూడిన మూడు కమిటీలను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ తెలిపింది.