కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ కి ‘గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉంది. అందులో 500 ఎకరాలు ఇస్తే.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా. కేసీఆర్ భూదానం చెయ్.. ఇండ్లు కట్టించే బాధ్యత నాది. జన్వాడలో కేటీఆర్ కు 50 ఎకరాలు ఉంది. అందులో 25 ఎకరాలు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. మాకు ఒక 500 కోట్లు ఇవ్వండి.. ఇదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మే కదా’ అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.