Homeహైదరాబాద్latest NewsDouble Dhamaka : ''డబుల్ ధమాకా'' అంటున్న స్టార్ హీరోలు

Double Dhamaka : ”డబుల్ ధమాకా” అంటున్న స్టార్ హీరోలు

Double Dhamaka : మన తెలుగు స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాయి, హీరో వర్సటైలిటీని చూపించే అవకాశం కూడా ఉంటుంది. హీరోల ఫ్యాన్స్ తమ హీరోను సిల్వర్ స్క్రీన్ మీద ఒక్కసారి కనిపిస్తేనే పండగ చేసుకుంటారు. అలాంటప్పుడు ఒకే సినిమాలో రెండు పాత్రలంటే ఫ్యాన్స్‌కి ”డబుల్ ధమాకా” అనే చెప్పాలి. అందుకే ఇలా డ్యూయల్ రోల్స్ ఉన్న సినిమాల రిలీజ్ టైంలో హైప్ ఎక్కువగా ఉంటుంది.అలాగే డ్యూయల్ రోల్ సినిమాలు ఎక్కువగా కమర్షియల్ హిట్స్ అవుతుంటాయి.ఈ క్రమంలో మన హీరోలు వరుసగా డ్యూయల్ రోల్స్ ఉన్న సినిమాలు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డబుల్ యాక్షన్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాని ”రౌడీ అల్లుడు”, ”యముడికి మొగుడు” లాంటి కధ నేపథ్యంతో అనిల్ తీయబోతున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ”బాహుబలి”, ”బిల్లా” వంటి సినిమాలొ డ్యూయల్ రోల్స్ చేసాడు. మరోసారి ప్రభాస్ తన ఫ్యాన్స్ కు డ్యూయల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ”ది రాజా సాబ్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ హారర్-కామెడీ చిత్రంలో ప్రభాస్ తాత-మనవడు పాత్రల్లో నటించనున్నారని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ”దేవర”. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసి భారీ హిట్ కొట్టాడు. అయితే ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాలో కూడా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అని సమాచారం.

‘పుష్ప” లాంటి భారీ హిట్ సినిమా తరువాత డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన కెరీర్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ సినిమాని సన్ పిక్టర్స్ నిర్మిస్తుంది.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా 1854-78 మధ్య రాయలసీమ నేపథ్యంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. ఈ సినిమాని దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img