డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రాబోతున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. “ఇస్మార్ట్ శంకర్” కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మే 15న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ టీజర్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.