డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుని ప్లాప్ సినిమాల జాబితాలో చేరింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు కలెక్షన్స్ పెద్దగా రాలేదు. అయితే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ ఆవుతోంది.