Homeజిల్లా వార్తలుడాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న వసుకుల సత్యనారాయణ

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న వసుకుల సత్యనారాయణ

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణానికి చెందిన వసుకుల సత్యనారాయణ విద్యార్థి దశ నుంచి ప్రజా ఉద్యమాలలో, అడిషనల్ డివిజన్ ఇంజనీర్ గా బహుజన ఉద్యమాలలో, సామాజిక ఉద్యమంలో, సమాజ సేవలో, ఉంటూ అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ భావజాలను కలిగి వివిధ ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొనందుకు గాను గుర్తించి జూన్ 25 వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బహుజన వెస్టర్న్ రైటర్స్ ఏడవ రాష్ట్రస్థాయి సమావేశం సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ వారు అందించే అవార్డులలో భాగంగా జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్నారు. అవార్డును సెలక్షన్ చేసిన రాష్ట్ర సెలెక్టెడ్ కమిటీ మెంబెర్ సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది డెలిగేట్స్ హాజరయ్యారు. బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నేను మరింత ఉత్సాహంతో సామాజిక ఉద్యమాలలో పాల్గొని ప్రజలకు చేరువై అన్ని వర్గాలను కలుపుకొని పోయి సేవ చేస్తానని తెలిపారు.

Recent

- Advertisment -spot_img