Homeహైదరాబాద్latest NewsDragon Movie : ఎన్టీఆర్ ''డ్రాగన్'' మూవీలో ప్రభాస్.. ''సాలార్'' మూవీతో లింక్ నిజమనే..?

Dragon Movie : ఎన్టీఆర్ ”డ్రాగన్” మూవీలో ప్రభాస్.. ”సాలార్” మూవీతో లింక్ నిజమనే..?

Dragon Movie : పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) ”డ్రాగన్” అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా షూటింగ్ ప్రారంభించారు. సినిమా ఒక పీరియడ్ డ్రామాగా ఉంటుందని ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సినిమా కథ చైనీస్ గ్యాంగ్‌స్టర్ జావో వీ జీవితం నుండి ప్రేరణ పొందినదని అంటున్నారు. జావో వీ థాయిలాండ్ మరియు మయన్మార్‌లలోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో ఒక కుఖ్యాత మాఫియా డాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ కూడా అదే తరహాలో ఈ సినిమాలో ఒక మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.

తాజాగా ఈ సినిమా నుండి వార్త వైరల్ అవుతుంది. ‘సాలార్’ మరియు ‘డ్రాగన్’ రెండూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలు కాబట్టి.. ఈ రెండు కధలను ప్రశాంత్ లింక్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో ప్రభాస్ కనిపిస్తాడు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండూ సినిమాలు భారీ యాక్షన్, గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ డ్రామా స్పష్టంగా ఉండేలా చూస్తున్నాడు. ‘సాలార్’లో ఖాన్సార్ నగరంలో గ్యాంగ్ వార్‌లు, అధికార పోరాటాలు ఎలా చూపించారో, అదే విధంగా ‘డ్రాగన్’లో బంగ్లాదేశ్ నేపథ్యంలో గ్యాంగ్‌ల మధ్య యుద్ధం, మాఫియా డాన్‌గా ఎన్టీఆర్ ఎదుగుదల చూపించబోతున్నారు అని సమాచారం.

Recent

- Advertisment -spot_img