Homeహైదరాబాద్latest Newsవర్షాకాలంలో డ్రైవింగ్.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఇక అంతే సంగతి..!

వర్షాకాలంలో డ్రైవింగ్.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఇక అంతే సంగతి..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని తారురోడ్లు, రోడ్లు ఎప్పుడూ తడిగా ఉంటాయి. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వాహన టైర్లకు పగుళ్లు వచ్చినా, ఉబ్బినా వెంటనే మార్చాలి. లేదంటే తడి రోడ్లపై బండి జారుతుంది. అలాగే తడిసిన రోడ్లపై సడన్‌బ్రేక్ వేస్తే స్కిడ్ అయి కింద పడిపోతారు, కావున బ్రేక్ నెమ్మదిగా వేయాలి. వర్షాకాలంలో రోడ్లపై గుంతలు ప్రమాదకరంగా మారుతాయి. అందుకే తక్కువ వేగంతో ప్రయాణిస్తే ప్రమాదం బారిన పడినా తీవ్రత తగ్గుతుంది.

Recent

- Advertisment -spot_img