హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బుల్లో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టింది. ఈ సందర్బంగా 37 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో టెస్టింగ్ పరీక్షలను నిర్వహించగా.. నలుగురికి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. తనిఖీల్లో జాయింట్ కమిషనర్ ఖురేషి, హైదరాబాద్, రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, అనిల్ కుమార్ రెడ్డి, టీజీ న్యాబ్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.