HomeTelugu Newsహైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. వారం రోజులుగా హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా డ్రగ్స్ గుర్తించారు. మరికొన్ని గంటల్లో నగర వాసులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌పై తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. ప్లబ్‌లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, బార్లు, ఇలా అనుమానం వచ్చిన ప్రతి చోట రైడ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో 100 గ్రాముల కొకైన్‌తో పాటు 29 ప్యాకెట్ల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని తెనాలి, ఒంగోలుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి మరింత సమాచారం వెలికి తీయనున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img