Homeహైదరాబాద్ఇక రాత్రి 9.30 తరువాతే హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్

ఇక రాత్రి 9.30 తరువాతే హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్

Police have been cracking down on Drunken Drive checks in hyderabad area since evening as the number of people caught driving under the influence of drugs is on the rise.

This is causing severe disruption to traffic in all areas being inspected.

Authorities responded to complaints of traffic jams and reports of traffic jams in various newspapers, citing their concerns over the issue.

మందు కొట్టి వాహనాలను నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో భాగ్యనగరి పరిధిలో సాయంత్రం నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలకు పోలీసులు దిగుతున్నారు.

దీంతో తనిఖీలు చేస్తున్న అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

ఈ విషయంలో తము పడుతున్న ఇబ్బంపదుల గురించి తెలుపుతూ, వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం, పలు పత్రికల్లో ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన వార్తలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.

రాత్రి 9 గంటల్లోపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని భావించిన ట్రాఫిక్ విభాగం, 7 తరువాత ఎక్కడెక్కడ డ్రైవ్ లను జరిపారన్న విషయాన్ని ఆరా తీశారు.

కొంతమంది ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో ఈ పని చేసి ఉంటారని భావిస్తూ, రాత్రి 9.30 గంటల తరువాతనే పరీక్షలు చేయాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు.

మందుబాబులు కూడా 10 గంటల తరువాతనే రోడ్లపైకి వస్తారన్న అంచనాతోనే, అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి 9.30 తరువాతే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించామని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.

Recent

- Advertisment -spot_img