– జులై 17 నుంచి 31వరకు నిర్వహణ
– ప్రకటించిన విద్యాశాఖ
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC) పరీక్షకు తేదీలు ఖరారయ్యారు. డీఎస్సీ పరీక్ష తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.