హైదరాబాద్: మాదాపూర్ డిటెక్టివ్ సబ్ ఇన్‌స్పెక్టర్(డీఎస్‌ఐ) అబ్బాస్ అలీ కరోనాతో మృతిచెందారు. ఇటీవల నీరసంగా ఉంటంతో.. మాదాపూర్‌లోని ఓ పైవేటు ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. ఆయన అదే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతున్న సమయంలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ రావడంతో.. ఆయన పరిస్థతి విషమించింది. దీంతో ఆయన చికిత్స పొందుతూ.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
వికారాబాద్ జిల్లాలోని బొంపల్లికి చెందిన అబ్బాస్ అలీ.. 1984లో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరాడు. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్‌గానూ పదోన్నతి లభించింది. అనంతరం ప్రమోషన్ రావడంతో.. అంబర్ పేట్‌లో శిక్షణ పొంది 10 నెలల క్రితం మాదాపూర్ పీఎస్‌లో డీఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. ఇక, ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతికి మాదాపూర్ పోలీసు సిబ్బంది సంతాపం తెలిపారు.
కరోనాతో మాదాపూర్ డీఎస్‌ఐ అబ్బాస్ మృతి
RELATED ARTICLES