ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో ఈ రోజు పలు గణేష్ విగ్రహాలను మరియు గోదావరి నిమజ్జనం స్థలాన్ని జగిత్యాల డిఎస్పి డి.రఘు చందర్ పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగింది. పలు గణేష్ మండప నిర్వాహకులతో మాట్లాడుతూ రాత్రిపూట ఇద్దరు లేదా ముగ్గురు మండపం వద్ద నిద్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ ఏ .రాం నర్సింహారెడ్డి బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.