Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల.. రూ.600 కోట్ల నష్టం : హరీష్ రావు

రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల.. రూ.600 కోట్ల నష్టం : హరీష్ రావు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి రూ.600 కోట్ల నష్టం జరిగింది అని హరీష్ రావు తెలిపారు. 2022లో ఫార్ములా-ఈ జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ వల్ల తెలంగాణ ఎకానమీకి రూ.600-700 కోట్ల లాభం జరిగిందని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెల్సన్ అనే సంస్థ తెలిపింది అని వెల్లడించారు. ఫార్ములా-ఈలో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మరి అవినీతి జరగకపోతే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఎలా ఎంక్వయిరీ చేస్తారు అని హరీష్ రావు ప్రశ్నించారు. ఫార్ములా-ఈ మొదటి సీజన్ ఖర్చు రూ.30 కోట్లు.. తెలంగాణ రాష్ట్రానికి రూ.700 కోట్లు లాభం వచ్చింది అని తెలిపారు. ఫార్ములా-ఈ మొదటి సారి జరిపినందుకు 192 దేశాల్లో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది అని హరీష్ రావు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img