తెలంగాణలోని కోల్ బెల్ట్ ఏరియా ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 14 మంది రావాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. అయితే దీనికి సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, దాసరి మనోహర్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో వీరి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. కాగా, బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించడంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.