సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ వెళ్లే దారిలో డమ్మీ బాంబు కలకలం రేపింది. ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ప్రయాణించే జూబ్లీహిల్స్ దారిలో నలుపు రంగు బ్యాగు లభించింది. దీన్ని సీఎల్‌డబ్ల్యూ అధికారులు స్వాధీనం చేసుకుని కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లి పరిశీలించగా అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ఈ బ్యాగు ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేసి వివరాలు వెల్లడించారు.