బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ మీదున్నారు. దాదాపు ఐదేండ్ల తర్వాత షారుఖ్‌కు ఈ ఏడాది వరుస హిట్లు పడ్డాయి. జనవరిలో పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్‌తో ఈ ఏడాదిని మొదలుపెట్టిన షారుఖ్ బాలీవుడ్ బాక్సాఫీసుకు మళ్లీ కలెక్షన్ల సునామీని చూపించాడు. సెప్టెంబర్‌లో రిలీజైన జవాన్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత షారుఖ్ ఒకే ఇయర్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. అయితే, షారుఖ్ ఖాన్ ప్రస్తుతం క్రియేటివ్ డైరక్టర్ రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో ‘డన్కీ’మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ఈ మూవీ గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకి రానుంది. రాజ్ కుమార్ హిరానీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్, జియో స్టూడియోస్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. తాప్సీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ప్రీతం సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ నెల 2న షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా డన్కి ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుంది. కాగా, ఈ సినిమాలో దియా మీర్జా, బోమన్ ఇరానీ, ధర్మేంద్ర, సతీష్ షా, పరీక్షిత్ సాహ్ని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా హిట్ అయితే షారుఖ్ ఖాన్ ఒకే ఏడాది హ్యాట్రిక్ సక్సెస్‌లు కొట్టినట్లే అవుతుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.