Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్​ హయాంలో టైమ్​ కు రైతు బంధు పడేది

బీఆర్ఎస్​ హయాంలో టైమ్​ కు రైతు బంధు పడేది

ఇదేనిజం, జగదేవపూర్: బీఆర్ఎస్​ హయాంలో సకాలంలో రైతు బంధు అందేదని ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. జగదేవపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అలిరాజుపేటలో సుమారుగా రూ. 33 లక్షలతో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాజీ ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గురువారం ప్రారంభించారు. అంతకుముందు జగదేవపూర్ పీఏసీఎస్​ కార్యాలయంలో మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్​ పాలనలో సొసైటీల ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ఎంపీపీ బాలేశం గౌడ్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి మాజీ జడ్పిటిసి రామచంద్రం ఎంపీటీసీలు కిరణ్ గౌడ్ కవిత శ్రీనివాస్ రెడ్డి రమ్య రవి కావ్య దర్గయ్య టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కో ఆప్షన్ సభ్యులు ఏక్బాల్ మాజీ సర్పంచులు చంద్రశేఖర్ యాదవ రెడ్డి ఏవో వసంతరావు నాయకులు సత్తిరెడ్డి రాంరెడ్డి బలరాం రెడ్డి పిఎసిఎస్ సిబ్బంది రాములు సత్తిరెడ్డి సందీప్ రెడ్డి పోచయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img