Homeహైదరాబాద్latest Newsపండుగ వేళ.. వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సర్కార్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సర్కార్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

ఓవైపు సాగునీటి సంక్షోభం.. ఇంకోవైపు రైతుభరోసా మోసం.. పండుగ వేళ సర్కారు వ్యవసాయాన్ని దండుగలా మార్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ.. ‘పొలం ఉన్న రైతులనూ పొట్టన బెట్టుకుంటున్నారు. కౌలుకు తీసుకున్న వారిని కబళిస్తున్నారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణం. అన్నదాతలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ముంచే రోజులు పోయి, మళ్లీ మంచిరోజులొస్తాయి’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img