అనసూయ, హీరో విజయ్ దేవరకొండ మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. విజయ్ దేవరకొండపై అనసూయ తరచూ పరోక్షంగా ట్వీట్లు చేస్తూ ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయను ట్రోల్ చేయడం కూడా తెలిసిన విషయమే. తాజాగా అనసూయ మరోసారి హీరో విజయ్ దేవరకొండపై సంచలన ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ చేసిన ‘దూరపు కొండలు నునుపు’ అని అనసూయ ట్వీట్ చేసింది. అయితే విజయ్ దేవరకొండనే టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ చేసింది నెటిజన్లు అంటున్నారు.ఈ ట్విట్ లో కొండ అని ఉండడంతో నెటిజన్లు విజయ్ దేవరకొండ గురించే అని అంటున్నారు. రష్మిక మండన్న, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన రష్మిక విజయ్‌తో ప్రేమలో పడింది. అయితే ఈ విషయంపై రష్మిక మండన్నకు ‘దూరపు కొండలు నుపు’ అంటూ అనసూయ సెటైర్ పోస్ట్ చేసిందని తెలుస్తుంది.