రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అధ్వాని హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని చిత్రబృందం ప్రకటించింది. ఈ గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.