ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. ఈ ప్రాంతంలోనే పలుమార్లు భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పరిశోధనలు సైతం అధికారులు చేశారు. మళ్లీ భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.