Earthquake : తెలంగాణ రాష్ట్రానికి భూకంపం హెచ్చరికలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత హైదరాబాద్‌లో, అమరావతిలో కూడా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశం ఉందని భూకంప పరిశోధన మరియు విశ్లేషణ అనే సంస్థ స్పష్టం చేసింది. గతంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చిన్నపాటి నుంచి ఓ మోస్తరు భూకంపాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రామగుండం దగ్గర భూకంపం వచ్చే అవకాశం ఉంది.