న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో బుధవారం తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషములకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.1 నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం కశ్మీర్లోని హెన్లీకి సమీపంలో ఉన్నట్లు గుర్తించినట్టు ప్రకటించింది. ఈశాన్య దిశలో 263 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని, భూ అంతర్భాగంలో 240 కి.మీ.లోతులో భూమి కంపించిందని వెల్లడించింది.