తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భూప్రకంపనలు సంభవించాయి. విజయవాడ, జగ్గయ్య పేట, తిరువూరు, గంపలగూడెం, హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, తదితర ప్రాంతాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపాల జోన్ 2లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. భూప్రకంపనలకు అవకాశం ఉన్న ప్రాంతాలను భూకంప మండలాలు (సెస్మిక్ జోన్లు) అంటారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం మన దేశంలో 4 భూకంప మండలాలున్నాయి. V, IV, III, II జోన్లు ఉండగా.. జోన్ Vలో అత్యధికంగా, IIలో అత్యల్ప భూకంపాలకు అవకాశం ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు రాగా ప్రజలు ఆందోళన చెందారు. మనం జోన్ 2లో ఉండటంతో అంతగా భయపడాల్సిన అవసరం లేదు.