సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్తున్నారా..? అయితే ట్రైన్ టికెట్ కోసం లైన్లో నిలుచొని నానా ఇబ్బందులు పడుతుంటారు. రద్దీ లైన్లో నిలబడి టికెట్ తీసుకోవడమంటే పెద్ద సవాల్ తో కూడిన పని. అయితే ఇప్పుడు లైన్లో నిలుచుకోకుండా నేరుగా ఫోన్ లోనే టికెట్ తీసుకోవచ్చు. ప్లే స్టోర్ కి వెళ్లి UTS యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్ లో మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేసి టికెట్ బుక్ చేసుకోవడమే. మరీ ఆలస్యం చేయకుండా.. ట్రైన్ ఎక్కే గంట ముందు టికెట్ బుక్ చేసుకొని ప్రశాంతంగా జర్నీ చేయండి.